భగవద్గీత !!

ద్వితీయోధ్యాయః!!

ఏకాగ్రత ఏవరికి రాదు !!

 

 


సాంఖ్యయోగము లో ....
కొన్ని నకారాత్మక శ్లోకాలు:

సాంఖ్య యోగములో ఒకచోట ఏకాగ్రబుద్ధి ఎవరికి రాదు అన్నదానిమీద కృష్ణుడు విశదీకరిస్తాడు. ఈ శ్లోకాలలో ఏవరికి ఎలా వస్తుంది అని కాదు. ఏవరికి రాదు అని. అఒదుకని ఈ శ్లోకాలని "న"కారాత్మక శ్లోకాలు అంటున్నాము.

యామిమాం పుష్పితాం వాచమ్ ప్రవదంత్య విపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||42||
కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదామ్ |
కియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి ||43||
భోగైశ్వర్య ప్రసక్తానాం తయాsపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమధౌ న విధీయతే ||44||

స|| హే పార్థ ! ( సర్వేషాం) వ్యవసాయిత్మికా బుద్ధిః ( ఏకాఅగ్రబుద్ధిః) సమాధౌ నవిధీయతే | వేద వాద రతాః, న అన్యద్ అస్తి ఇతి వాదినః , కామాత్మానః , స్వర్గ పరాః , అవిపశ్చితః ( అవివేకః) జన్మకర్మ ప్రదాం భోగైశ్వర్య గతిం ప్రతి క్రియా విశేష బహుళాం పుష్పితాం యామ్ ఇమామ్ వాచం ప్రవదన్తి తయా అపహృత చేతసాం భోగైశ్వర్య ప్రసక్తానామ్ (ఇమే) వ్యవసాయిత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే |
తా|| ఓ అర్జునా ! వేదములందు ఫలములను తెలుపు భాగములందు ఇష్టము కలవారు,అందులో చెప్పబడిన స్వర్గాదులకంటే అధికమైన ఫలము లేదని వాదించువారు, కామము పై ధ్యానమున్నవారు, స్వర్గాభిలాషులు, జన్మము కర్మము తత్ఫలమునొసగు వాక్యముల చేత ,భోగైశ్వర్యఫలములకలిగించు క్రియలను గురించి చెప్పు వాక్యముల చేత అపహరింపబడిన మనస్సు కలవారు , అట్టి వారికి దైవ ధ్యానమందు ( సమాధి లో) నిశ్చయమైన ( ఏకాగ్ర) బుద్ధి కలగదు !!

ఏవరికి ధ్యానములో ఏకాగ్రత గల బుద్ధి కలుగదో అన్న ప్రశ్నకి ఇది సమాధానము !

సామాన్యముగా మనకి చాలాభాగము ఏవిధముగా చెయ్యాలి , ఎందుకు చెయ్యాలి ఎవరు చెయ్యాలి అన్నమాటలలోనే ముందుకు వేడతాము. ఆపని చేయాలని ఆశక్తి ఉంది కాబట్టి చేసే విధానాలగురించి ధ్యానము ఉంటుంది. నిజానికి ఏవరికి ధ్యానములో ఏకాగ్రత కలుగదో అన్నమాటతో మనకేమీ సంబంధము వుండదు. మనకు ఏట్లాగ ఏకాగ్రత కలుగవచ్చు అన్నదానిమీదే మన ధ్యానమంతా ఉంటుంది.

కాని తార్కిక సంఘాలలో "న’" కారానికి సంబంధించిన విషయాలలో కూడా ఆశక్తి వుంటుంది. బ్రహ్మం ని గురించి చెప్పునప్పుడు ఏది బ్రహ్మం కాదో "న " కారము ద్వారా "న ఇతి" "న ఇతి" అంటూ చెప్పడ సులభము. ఏది బ్రహ్మమో చెప్పడము కష్టము. ఆవిధముగా మనకి అక్కరలేదు అనిపించినా గాని "న" కారము తో వచ్చిన మాటకూడా అప్పుడప్పుడు చూడడము సబబే

ఈ శ్లోకాలు ఏవరికి ఏకాగ్రత కలుగుతుంది అనే బదులు ఎవరికి ఏకాగ్రత కలుగదు అన్నమాట మీద .
ఎవరికి కలుగదు అన్నది నకారాత్మక భాష.

ఏవరికి ఏకాగ్రత కలుగదు అన్నమాటలలో కూడా మనకి కొన్ని సంగతులు తెలుస్తాయి. అ విషయముల కోసమే ఈ శ్లోకాలను పరిశోధిద్దాము.

కృష్ణుడు ఈ శ్లోకములో చేపుతాడు:

"హే పార్థ ! ( సర్వేషాం) వ్యవసాయిత్మికా బుద్ధిః ( ఏకాగ్రబుద్ధిః) సమాధౌ నవిధీయతే" |
ఓ పార్థా అందరికీ సమాధిలో ఏకాగ్రబుద్ధి కలగదు |

ఏవరికి కలుగదు అంటే మొదటి శ్లోకములో మొదలెడతాడు.

1 "వేదవాదరతాః న అన్యత్ అస్తి ఇతి వాదినః" :
"వేదములో చెప్పబడిన కర్మకాండలే తప్ప ఇంకో విధానము లేదు అనే వారు".

ఆంటే ఇక్కడ కృష్ణుడు వేదములో చెప్పబడిన కర్మకాండ ముఖ్యముకాదు అని కుండబద్దలుకొట్టి చెప్పినట్లు చెపుతున్నాడు.

ఇది చాలా చాలా ముఖ్యమైన సంగతి.

మనము చిన్నప్పటినుంచి మడి ఆచారము ద్వారా కర్మకాండ వెనకే వెళ్ళేవాళ్ళము . ఇప్పుడు కూడా కష్టాలలో వున్నప్పుడు హోమాలు జపాలు జరిపించని వాళ్ళు తక్కువ. గీత లో కృష్ణుడు చెప్పినది వేదములోని కర్మకాండే తప్ప ఇంకో మార్గము లేదనువారికి నిజముగానే ఇంకో మార్గము ఉండదు అని అన్నమాట !

అంటే ఒకనొకప్పుడు వేదము అంటే కర్మకాండే అని ప్రబలమైనప్పుడు , దానిని ఖండించి వేదము లోని వేదాంతమే ముఖ్యము చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినది దన్నమాట. వేదములలోని కర్మకాండ ఒక సోపానమే. అది అధిగమించి ముందుకు పోతూవుంటే వచ్చే చివరి సోపానమే వేదాంతము ఆ తరువాత మోక్షము.

అంటే దీని బట్టి వేదాలను మూలబెట్టి పూర్తిగా అద్వైత ధోరణిలో పోవాలా అని ప్రశ్న రావచ్చు.
అప్పుడు మనకి అద్వైత వేద శిఖామణి శంకరాచార్యులవారు చెప్పినట్లు దేముడు దేముని మీద భక్తి అన్నది ఒక సోపానము అని గుర్తు తెచ్చుకోవాలి . అ సోపానము అదిరోహించి చిత్తశుద్ధి అయి , ఆ శుద్ధి అయిన చిత్తముతోఇంకా జ్ఞానోపాసన చేసితే అప్పుడు కలిగే జ్ఞానోదయములో కర్మకాండ మీద విరక్తి , నిష్కామకర్మ మీద భక్తి రావచ్చు.

2 "కామాత్మనః" ; "స్వర్గపరాః"

కామాత్మనః అంటే కామము కలవారు లేక కోరికలు గలవారు,
సర్గపరాః అంటే స్వర్గము కావాలి అని కోరుకొను వారు.

వీళ్ళిద్దరూ నిజానికి వేదాలలోని కర్మకాండ అనుసరించెడి వారే ; మొదట్లో చెప్పిన మాట ( వేదవాదరతాః) చెప్పిన తరువాత తర్వాత ఈరెండు చెప్పనక్కరలేదు. కాని చేప్పాడు అంటే కృష్ణ భగవానుడి కి కూడా తెలుసు. ఇది కలికాలము . ఓకసారి చెపితే చాలదు . మూడు సార్లు చెప్పాలసిందే అని

కోరికలు గలవారికి నిష్కామ కర్మకి చాలా చాలా దూరము.
స్వర్గము కావాలి అనుకునేవాళ్ళకి కూడా నిష్కామకర్మ అనే ప్రశక్తే ఉండదు.

3 క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతింప్రతి :

భోగైశ్వర్యములకోసము అనేక కర్మలను చేయు వారు .. ఇది కూడా మొదటి మాటకి మళ్ళీ తిరగవేసి చెప్పడమే . వీళ్ళకి ఏకాగ్రత వుంటుంది. కాని అది భోగైశ్వర్యములు సంపాదించడము లోనే ఉంటుంది.

4 "యాం ఇమామ వాచం ప్రవదంతి తయా అపహృత చేతసాం"
అది కొంచెము పెద్దవాక్యమైనా ..వినతగిన అలోచించ తగిన వాక్యము.

ఇక్కడ కృష్ణుడు ఏమి అంటున్నాడు?

"ఇలాంటి ( కోరికలను పెంచే) మాటలను చెపుతున్నారో ఆ మాటల చేత అపహరించబడిన మనస్సు గలవారు"

స్వర్గాన్ని చూపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు .
వాళ్ళమాటలను విని ఆ దోవన పోయే వారు ఉంటారు.
ఆలాంటి వాళ్ళకి కూడా ఏకాగ్రత అన్నది వేరే దానిమీద ఉంటుంది తప్ప ధ్యానములో ఏకాగ్రత ఉండదు!

ఇది అంతా కలిపిచూస్తే తేలేది ఒకటే

వైదీక కర్మ కాండ కాదు కావాలసినది. నిష్కామ కర్మ యే నిజమైన కర్మయోగము.

అంటే "న" కారములో నుంచి కూడా వచ్చినది "స" కారమే ||

|| ఓమ్ తత్ సత్ ||